Reading Time: 2 minutes
Gold Rates: బంగారం రూ.5 వేలు డౌన్.. వెండి రూ.1500 క్రాష్.. ధరల్లో భారీ మార్పులు..

బంగారం, వెండి ధరలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. పసిడి ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల రెండు వారాల పాటు ధరలు తగ్గగా.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు వారాలుగా భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ వారం విషయానికొస్తే.. వారం ప్రారంభంలో ధరలు నిలకడగా తగ్గినప్పటికీ.. గత రెండు రోజుల్లో కొంత పెరిగాయి. అయితే ఈ వారంలో గోల్డ్, సిల్వర్ ధర భారీగా తగ్గిందని చెప్పవచ్చు. ఈ వారంలో ఎలా కొనసాగాయనే డీటైల్స్ ఇప్పుడు వివరంగా చూద్దాం.

బంగారం రేట్లు ఇవే..

ఈ వారంలో 10 గ్రామలు బంగారం ధర ఏకంగా రూ.5 వేలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. వరుసగా నాలుగు రోజుల పాటు పడిపోగా.. రెండు రోజుల పాటు స్వల్పంగా పుంజుకున్నాయి. జూన్ 7న 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,760 వద్ద ప్రారంభమవ్వగా.. జూన్ 10 నాటికి రూ.1,48,130కి పతనమయ్యాయి. ఇక జూన్ 11న మళ్లీ కొలుకుని రూ.1,49,540కి చేరుకోగా.. శుక్రవారం నాటికి రూ.1,50,890కి చేరుకున్నాయి. వారం మొత్తం చూస్తే రూ.5 వేలు తగ్గాయి.

వెండి ధర ఎంత తగ్గిందంటే..?

ఇక వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. ఈ వారంలో కిలో వెండి రూ.1500 మేర తగ్గింది. జూన్ 7న కేజీ సిల్వర్ ధర రూ.2,49,110 వద్ద ఉండగా.. జూన్ 10వ తేదీ వరకు పతనం కొనసాగింది. జూన్ 11న రూ.2,41,460 వద్ద ఉండగా.. జూన్ 12 నాటికి రూ.2,47,610కి పెరిగాయి.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?

గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. ఇందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రభావం బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం దాదాపు ఖారారు అయినట్లేనని, జెనీవా వేదికగా త్వరలో సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో తగ్గనున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండగా.. గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను బట్టి బంగారం ధరలు తగ్గడం లేదా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య సరఫరా గొలుసు వ్యవస్థ దెబ్బతినడంలో అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడిప్పుడే క్రూడ్ ఆయిల్ ధరలు దిగొస్తున్నాయి.