Reading Time: < 1 minute

పట్టువీడని ‘కాడ్లాపూర్’ భూ బాధిత రైతులు… పరామర్శకు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అరెస్ట్ 

Caption of Image.

పరిగి, వెలుగు: కాడ్లాపూర్​ఇండస్ట్రియల్​ భూ బాధిత రైతులు పట్టువీడకుండా ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పల మహేశ్​రెడ్డితోపాటు కొంతమంది బీఆర్ఎస్​నాయకులను పోలీసులు రంగాపూర్​వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. 

ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. మహేశ్​రెడ్డిని బలవంతంగా చెన్గోముల్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. బీఆర్ఎస్​నాయకుల తీరు రైతులను రెచ్చగొట్టేలా ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే వారిని అరెస్ట్​చేసినట్లు పోలీస్​అధికారులు తెలిపారు. 

‘నేను రైతుల వద్దకు వెళ్లడం లేదు, ఎక్కడికీ రాను.. ఇంటికి వెళ్లొద్దా? కావాలంటే బండి ఎక్కండి.. నా ఇంటి వద్ద మనుషులను పెట్టండి’ అంటూ మహేశ్​రెడ్డి పోలీసులతో గొడవకు దిగారు.  

©️ VIL Media Pvt Ltd.