Reading Time: 2 minutes

రేపే భారత్ vs పాక్ మధ్య బ్లాక్ బస్టర్ పోరు.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే!

Caption of Image.

India and Pakistan Match: మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీలో అసలు సిసలైన బిగ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు రేపు (ఆదివారం, 2026, జూన్ 14 ) బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తలపడనున్నాయి. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిచి ఐసీసీ ట్రోఫీ కల నెరవేర్చుకున్న భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జోష్‌లో పొట్టి ఫార్మాట్ (T20) వరల్డ్ కప్‌ను కూడా ముద్దాడాలని చూస్తోంది. ఐదుసార్లు సెమీఫైనల్, ఒకసారి ఫైనల్ చేరినా తృటిలో చేజారిన కప్పును ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కసితో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన బరిలోకి దిగుతోంది. తటస్థ వేదికపై జరిగే ఈ పోరులో పాకిస్తాన్‌ను చిత్తు చేసి టోర్నీని విక్టరీతో స్టార్ట్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.

మ్యాచ్ స్టార్ట్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?: 
భారత కాలమానం ప్రకారం ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందే టాస్ పడనుంది. సండే ప్రైమ్ టైమ్‌లో మ్యాచ్ ఉండటంతో ఫ్యాన్స్‌కు ఫుల్ వినోదం గ్యారెంటీ. ఇక ఈ మ్యాచ్‌ను మీ టీవీల్లో చూడాలనుకుంటే.. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports 1, Star Sports 2, Star Sports 3, HD ఛానల్స్) లో లైవ్ టెలికాస్ట్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మొబైల్స్ లేదా స్మార్ట్ టీవీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చూడాలనుకుంటే.. జియోహాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్ ద్వారా ఈ మ్యాచ్‌ను లైవ్‌గా చూడొచ్చు. 

హెడ్ టు హెడ్ రికార్డులు: 
మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీ చూసుకుంటే పాకిస్తాన్‌పై టీమిండియాదే పూర్తి ఆధిక్యం కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 16 మ్యాచుల్లో భారత్ ఏకంగా 13 విజయాలతో టాప్‌లో ఉండగా.. పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే.. మెగా టోర్నీలో ఇరు జట్లు తలపడిన మ్యాచుల్లో భారత్ 6 సార్లు విక్టరీ సాధించగా, పాక్ 2 సార్లు గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ 3 పొజిషన్‌లో ఉంటే, పాకిస్తాన్ నెంబర్ 8లో కొనసాగుతోంది. కానీ పాక్ సాధించిన 3 విజయాలలో రెండు వరల్డ్ కప్ వేదికలపైనే వచ్చాయి కాబట్టి ఇండియన్ అమ్మాయిలు జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. 
 
ఇరు జట్ల ఫామ్ ఎలా ఉందంటే?: 
ప్రస్తుత ఫామ్ విషయానికి వస్తే ఇరు జట్లు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నాయి. భారత్ ఇటీవల సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లలో పరాజయాలు చవిచూసింది. దానికి తోడు వరల్డ్ కప్ ముందు ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లో ఒక్కటే గెలిచింది. అయినప్పటికీ పాకిస్తాన్‌పై ఉన్న గత రికార్డులు, టీమ్ బలాబలాలు భారత్‌కు కొండంత అండగా నిలవనున్నాయి. మరోవైపు కొత్త కెప్టెన్ ఫాతిమా సనా నేతృత్వంలోని పాక్ జట్టు కూడా ఫామ్ లేమితో సతమతమవుతోంది. ఆడిన చివరి ఐదు టీ20 మ్యాచ్‌లలో ఆ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. 

ALSO READ : ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన బ్లాక్ బ్యూటీ..

ఇరు జట్ల అంచనా స్క్వాడ్స్: 
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్,అరుంధతి రెడ్డి, శ్రీచరణి

పాకిస్తాన్ మహిళల జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలీయా రియాజ్, అలియా అలవి, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, తుబా హసన్, గుల్ ఫిరోజా, రమీన్ షమీమ్, ఉమ్మే హాని, తస్మియా రుబాబ్.
 

©️ VIL Media Pvt Ltd.