Reading Time: < 1 minute

ఉప్పల్ భగాయత్ లో అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం

Caption of Image.

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​భగాయత్​లోని ఓ అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయల్​రిడ్జి అపార్ట్​మెంట్​నాలుగో ఫ్లోర్- 401 ఫ్లాట్​లో కులదీప్​అనే వ్యాపారి ఉంటున్నారు. గురువారం రాత్రి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. తర్వాత ఏసీ యూనిట్​లో మంటలు అంటుకొని, దట్టమైన పొగ కమ్మేసింది. 

స్థానికులు గమనించి ఫైర్​ స్టేషన్​కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి, మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బెడ్ రూమ్​లోని ఫర్నిచర్ దగ్ధమైందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ​  

©️ VIL Media Pvt Ltd.