Reading Time: < 1 minute

కుంకుమ పువ్వుతో బ్యూటీ సీక్రెట్స్.. మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం

Caption of Image.

కుంకుమ పువ్వు (సాఫ్రన్) కేవలం వంటకాలకు రంగు, రుచి అందించడమే కాదు.. అనేక హెల్త్, బ్యూటీ బెనిఫిట్స్ అందించే సహజ సిద్దమైన ఔషధం. విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉండే ఈ ఖరీదైన సుగంధ ద్రవ్యం.. చర్మం ఆరోగ్యం, జుట్టు పెరుదలలో కీలకమైన పదార్థం. కుంకుమ పువ్వును ఎలా వాడితే లభించే ఆరోగ్య ప్రయోజనాలు, మెరిసే చర్మం, ఒత్తయిన జుట్టును ఎలా పొందవచ్చో తెలుసుకుందాం..

కుంకుమ పువ్వు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, పింపుల్స్‌, పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గించడంలో సాయపడతాయి.  అంతేకాదు జుట్టు పెరుగుదలకు తోడ్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ సంరక్షణలో కుంకుమ పువ్వును చేర్చుకుంటే సహజ కాంతితో మెరిసే చర్మం, ఆరోగ్యవంతమైన జుట్టును పొందవచ్చు.

►ALSO READ | జ్వరం, జలుబు, గొంతునొప్పా ? ఇంట్లోనే కషాయంతో ఇలా చెక్ పెట్టండి!

కుంకుమ పువ్వు హెయిర్ ఫాలికల్స్ మెరుగుపరిచి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. అందుకు ఏదైనా నూనెలో కుంకుమ పువ్వు కలిపి రోజూ జుట్టుకు అప్లై చేస్తుండాలి.

స్కిన్ టోన్ పెరగాలంటే కుంకుమ పువ్వు, ముల్తానీ మట్టిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని రోజూ ముఖానికి అప్లై చేస్తే ముఖం నిగనిగలాడుతుంది.

ఇందులో క్వెర్సెటిన్, కంఫెరోల్ లాంటి ఫ్లేవనాయిడ్స్ లక్షణాలు ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ తగ్గిస్తాయంటున్నారు బ్యూటీషియన్లు. 

©️ VIL Media Pvt Ltd.