Reading Time: 2 minutes

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే..

Caption of Image.

వర్షాకాలం వచ్చిందంటే వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సీజన్ లో నీటి నిల్వతో దోమలు ,ఇతర క్రిమీ కీటకాలు  ఎక్కువగా పెరుగుతాయి.. నీరు కలుషితం అవుతుంది. ఇది మన శరీరంపై ప్రభావం చూపి  అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత,  తీసుకునే ఆహారం,  తాగేనీరు, ఇంటి పరిసరాలపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాల్సిన చాలా ముఖ్యం. వానాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏంచేయాలో  ఆరోగ్య నిపుణులు ఏం చేబుతున్నారో చూద్దాం.. 

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను రక్షించుకోవచ్చు. 

వర్షాకాలంలో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. తాజా ఆహార పదార్థాలు వేడివేడిగా వండుకొని తినాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వండిన వేడి ఆహారాన్ని  మాత్రమే తీసుకోవాలి.  

ఇక నీటి విషయానికి వస్తే.. తాగునీటిని తప్పనిసరిగా మరిగించి లేదా శుద్ధి చేసిన నీటినే ఉపయోగించాలి. కలుషితమైన నీటి వల్ల జలుబు, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. బయట ఆహారం తినడం తగ్గించి, ఇంట్లో తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

►ALSO READ | జ్వరం, జలుబు, గొంతునొప్పా ? ఇంట్లోనే కషాయంతో ఇలా చెక్ పెట్టండి!

రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరి, నారింజ వంటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వర్షంలో తడిసిన వెంటనే పొడి దుస్తులు ధరించడం అవసరం. తడి బట్టలతో ఎక్కువసేపు ఉండటం వల్ల జలుబు, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్చు.

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ నీటిలో దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణమవుతాయి. అవసరమైతే దోమతెరలు, దోమల నివారణ మందులను ఉపయోగించాలి.

తగినంత నిద్ర, స్వల్ప వ్యాయామం, పరిశుభ్రత పాటించడం ద్వారా వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్‌ను ఆనందంగా, ఆరోగ్యంగా గడపవచ్చు.

©️ VIL Media Pvt Ltd.