Reading Time: 2 minutes
ట్రైలర్ కాదు.. చిన్న సైజ్ సినిమా చూపిస్తున్నారుగా..!

రెండున్నర నిమిషాల ట్రైలర్‌నే.. కథ ఎక్కడ లీక్ అవుతుందో అని జాగ్రత్తగా కట్ చేస్తుంటారు మేకర్స్. అలాంటిది 4 మినిట్స్‌కు పైగా ట్రైలర్ కట్ చేయమంటే సాహసమే. అదే చేస్తున్నారిప్పుడు కొందరు దర్శకులు. తాజాగా ఓ ట్రైలర్ 4.10 నిమిషాలతో వచ్చింది. ఏంటా సినిమా..? అసలు ఇండియాలో అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ట్రైలర్స్ ఏంటి..? మామూలుగా ట్రైలర్ అంటే 2.30 నిమిషాలు ఉంటుంది. కథ కాస్త పెద్దగా ఉంటే ఓ 15 సెకన్లు పెంచుతారు. కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం ఏకంగా 4 నుంచి 5 నిమిషాల ట్రైలర్స్ కట్ చేస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ వెల్ కమ్ టూ ది జంగిల్ ట్రైలర్ 4 నిమిషాల 10 సెకండ్లతో వచ్చింది. ఇందులో స్టార్ క్యాస్ట్ అంతా రివీల్ చేశారు. సగం బాలీవుడ్ ఈ సినిమాలో నటిస్తుంది. అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న వెల్ కమ్ టూ ది జింగిల్‌లో ఫ్లాప్ హీరో అంటూ తనపై తానే సెటైర్లు వేయించుకున్నారు అక్షయ్ కుమార్. ఇండియన్ సినిమాలో రెండో లాంగెస్ట్ ట్రైలర్ ఇది. ఫస్ట్ ప్లేస్‌లో రోహిత్ శెట్టి పోలీస్ డ్రామా సింగం అగైన్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఏకంగా 4.58 సెకన్లు ఉంటుంది. రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్ హీరోలుగా నటించారు. రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లోనే వచ్చిన సర్కస్ సినిమా ట్రైలర్ 3.53 నిమిషాలుంటుంది. మన దర్శకులు కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ ట్రైలర్‌ను ఏకంగా 3 నిమిషాల 47 సెకన్లతో వచ్చింది. అలాగే రాజమౌళి కూడా ట్రిపుల్ ట్రైలర్‌ను 3.16 నిమిషాలు కట్ చేసారు.. ఇక పద్మావత్ ట్రైలర్ 3.10 నిమిషాలతో వచ్చింది. మొన్నొచ్చిన రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ కూడా 3.07 నిమిషాలు కట్ చేసారు బుచ్చిబాబు. సినిమాలో కథను బట్టి ట్రైలర్ లెంత్ కూడా పెంచేస్తున్నారు మేకర్స్. పెద్దితో పాటు కొన్ని సినిమాలకు కథ ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. మరికొన్నింటికి మాత్రం సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ.. క్యారెక్టర్స్ అన్నీ పరిచయం చేస్తున్నారు. ఈ ఫార్మాట్ బాగానే వర్కవుట్ అవుతుంది కూడా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!

ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..

Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది

Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?