Reading Time: 2 minutes
రిలీజ్ కాదు.. రీచ్ మీద ఫోకస్ పెట్టండి

ప్యాన్ ఇండియా అంటే అన్ని భాషల్లో సినిమా రిలీజ్ చేయడం కాదు.. అన్నిచోట్లా అది ఆడటం..! ఇక్కడే మన మేకర్స్ ఫెయిలవువుతున్నారా..? తెలుగులో ఆడుతున్న సినిమాలు మిగిలినచోట్ల ఎందుకు చేతులెత్తేస్తున్నాయి.. అసలు తప్పెక్కడ జరుగుతుంది..? అసలు ఓ ప్యాన్ ఇండియన్ సినిమా వర్కవుట్ ఏయే ఫ్యాక్టర్స్ ఉండాలి..? డిస్కస్ చేద్దాం పదండి ఎక్స్‌క్లూజివ్‌గా.. ప్యాన్ ఇండియన్ సినిమా కామన్ అయిపోయిందిప్పుడు.. అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు కానీ అవి ప్రభావం చూపించట్లేదు. వేరేచోట్ల సక్సెస్ అవ్వాలంటే మంచి సినిమా అయితే సరిపోదు. దానికి సరైన రిలీజ్ టైమ్ కావాలి. హిందీ, తమిళం, కేరళ, కర్ణాటకలో వాళ్ల స్టార్ సినిమాలు లేని టైమ్‌లో రిలీజ్ చేయాలి. అలా వచ్చినపుడే స్క్రీన్ కౌంట్ సరిగ్గా ఉంటుంది. అన్ని ఫ్యాక్టర్స్ వర్కవుట్ అయితేనే విజయం వరిస్తుంది.. అలా కాకుండా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే వర్కవుట్ అవ్వదు. అన్ని భాషల్లో, అన్ని మార్కెట్లలో భారీ కలెక్షన్స్ రావాలంటే ఇండియా వైడ్‌గా రిలీజైతే సరిపోదు.. అలా చేస్తే ఈజీగా భారీ కలెక్షన్స్ రాబడుతుందన్న అపోహతో బడ్జెట్‌లను అమాంతం పెంచేసే విషయంలో నిర్మాతలు, దర్శకులు కాస్త ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ మధ్య వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా రిజల్ట్స్ ఏమంత గొప్పగా లేవు. హీరో స్టార్‌డమ్‌తో పాటు డైరెక్టర్ బ్రాండ్ కూడా కీలకమే. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్‌ లాంటి కొందరు దర్శకులకే ఈ రేంజ్ బ్రాండ్ ఏర్పడింది. అన్నింటికీ మించి భాషతో సంబంధం లేని ఎమోషన్, దేశవ్యాప్తంగా కనెక్ట్ అయ్యే కథ, ప్రాంతీయతను దాటే కాన్సెప్ట్ సినిమాలో ఉండాల్సిందే. సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయడం మొదటి అడుగు మాత్రమే. కానీ అన్నిచోట్లా మెప్పించి వసూళ్లు సాధించినప్పుడే అది నిజమైన ప్యాన్ ఇండియా విజయం. బాహుబలి తర్వాత ఆ ఫీట్ పుష్ప, కార్తికేయ 2, RRR, కల్కి, సలార్ లాంటి కొన్ని సినిమాలకే సాధ్యమైంది. మిగిలినవన్నీ అన్నిచోట్లా విడుదలయ్యాయంతే.. విజయం సాధించలేదు. ఇకపై అయినా అలాంటి కథలు వస్తాయేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!

ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..

Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది

Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?