Reading Time: < 1 minute

ఖమ్మం టూ ఒడిశా స్మగ్లింగ్ మాఫియా .. కోటి రూపాయల గంజాయి సీజ్

Caption of Image.

ఖమ్మం జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు ఈగల్ ఫోర్స్ పోలీసులు .కొనిజర్ల పోలీసుల పక్కా సహకారంతో… రహదారిపై వ్యూహాత్మకంగా వాహనాలను అడ్డగించిన ఈగల్ ఫోర్స్, స్మగ్లర్ల ఆట కట్టించింది. ఈ మెరుపు దాడిలో దాదాపు కోటి రూపాయల విలువైన… 200 కిలోల డ్రై గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.

పోలీసుల కళ్ళు గప్పి కారు, బొలెరో వాహనాల్లో అత్యంత చాకచక్యంగా తరలిస్తున్న 104 గంజాయి ప్యాకెట్లను, వాటితో పాటు 7 మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ముఠా నెట్‌వర్క్ చూస్తే పోలీసులు సైతం విస్తుపోతున్నారు. గంజాయి సరఫరా కోసం ముందస్తుగానే ఒక లక్షా 90 వేల రూపాయలను బ్యాంక్ ఖాతాల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ భారీ సరుకు గమ్యస్థానానికి చేరితే… ఇద్దరు ప్రధాన నిందితులకు ఏకంగా 8 లక్షల రూపాయలు ఇచ్చేలా భారీ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.

►ALSO READ | ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ సిట్

 ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడానికి ఈగల్ ఫోర్స్ ఏకంగా 18 నెలల పాటు, అంటే ఒకటిన్నర సంవత్సర కాలం నిఘా పెట్టింది.ఈ భారీ స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ నెట్‌వర్క్‌కు వెన్నుముకగా నిలిచిన ప్రధాన ఫైనాన్షియర్ ప్రభు, సప్లయర్ దేవి సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలను తీవ్రం చేశారు.

©️ VIL Media Pvt Ltd.