
యువ హీరో అశోక్ గల్లా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వీసా’: వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అనగా అనగా అమెరికా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ పాటకి సనారె సాహిత్యం అందించగా.. సంజిత్ హెగ్డే ఆలపించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా, అమెరికా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మీరు కూడా ‘అనగా అనగా అమెరికా’ పాటను వినేయండి…