Reading Time: < 1 minute

టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో హార్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 45 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇరాన్ పారామిలిటరీ ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్’కు ఈ ప్రాంతంలో స్థావరం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ ఘటనపై స్పందించలేదు.