Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్, భారత్ మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకు ముఖ్యమైనదే. ఈ మ్యాచ్‌లో గెలిచి జట్టు సెమీ ఫైనల్‌కి.. ఓడిన జట్టుకు ఇంటికి వెళ్తుంది. దీంతో ఈ ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్‌లో పిచ్ అంటే బౌలింగ్‌కి అనుకూలిస్తుంది. కానీ, ఈసారి బ్యాటింగ్‌కి అనుకూలమైన పిచ్‌ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరిశీలిచారు. ఈ విషయాన్ని క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తెలిపారు. గంగూలీ పిచ్ విషయయంలో హర్షం వ్యక్తం చేశారని ముఖర్జీ పేర్కొన్నారు. బ్యాటర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుందని.. అదే సమయంలో మంచి లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి ఉంటే బౌలింగ్ కూడా బాగానే సహకారం అందుతుందని స్పష్టం చేశారు.