Reading Time: < 1 minute

అహ్మదాబాద్: టి-20 ప్రపంచకప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా వెస్టిండీస్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి విండీస్.. సఫారీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయారు. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డారు. ఈ నేపథ్యంలో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్‌ల జోడి జట్టుకు అండగా నిలిచింది. ఇద్దరు కలిసి 89 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలో హోల్డర్ 49 పరుగుల వద్ద ఔట్ కాగా, రొమారియో(52) అర్థ శతకం సాధించాడు. ఫలితంగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి.. 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో ఎంగిడి 3, రబాడా, బోష్ తలో రెండు వికెట్లు తీశారు.