Reading Time: < 1 minute

బాపట్ల: జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న సహస్ర(20) ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో సహస్ర మృతి చెందగా.. అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్‌ని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సహస్ర గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది.