
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ఇతర సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
అమ్మవారికి గీతారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితు లు ఆమెకు ఆశీర్వచనం అందించి, శాలువాతో సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు.