Reading Time: < 1 minute

పాంటెవెండ్రా ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ లో రిత్విక్‌‌కు మూడో ప్లేస్

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ రాజా రిత్విక్‌‌.. స్పెయిన్‌‌ వేదికగా జరిగిన పాంటెవెడ్రా ఇంటర్నేషనల్‌‌ చెస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో కాంస్య పతకం గెలిచాడు. మొత్తం 9 రౌండ్లలో 5 విజయాలు, 4 డ్రాలతో 7 పాయింట్లు సాధించాడు. అయితే టైబ్రేక్‌‌లో 44.11 పాయింట్లతో మూడో ప్లేస్‌‌లో నిలిచాడు. 

ఐఎం ముత్తయ్య అల్‌‌ 7 పాయింట్లతో సమంగా నిలిచినా టైబ్రేక్‌‌లో 46.67 పాయింట్లు సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. క్యూబా ప్లేయర్‌‌ లూయిస్‌‌ డేనియల్‌‌ 46.00 పాయింట్లతో రజతం నెగ్గాడు. ప్రపంచ వ్యాప్తంగా 92 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. 

ఇదివరకే ఫ్రాన్స్‌‌లో జరిగిన మెనుయిర్స్ ఇంటర్నేషనల్‌‌ టోర్నమెంట్‌‌లో రజత పతకం సాధించిన రిత్విక్, తాజాగా స్పెయిన్ టోర్నీతో కలుపుకుని రెండు వేర్వేరు పోటీలలో వరుసగా 18 మ్యాచ్‌‌ల్లో అజేయంగా కొనసాగడం విశేషం.
 

©️ VIL Media Pvt Ltd.