
చార్మినార్ వెలుగు: లాల్‌దర్వాజా శ్రీసింహవాహిని మహంకాళి దేవాలయంలో శుక్రవారం శిఖర పూజ, ధ్వజారోహణ, ఇతర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్కమిషనర్సజ్జనార్ పాల్గొన్నారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ పాతబస్తీ బోనాలకు 2 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తుతో పాటు 100 సీసీ కెమెరాలు, డౌన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయన్నారు. సౌత్ రేంజ్ అడిషనల్సీపీ తఫ్సీర్ ఇక్బాల్,చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కే. సత్యనారాయణ, ఎండో మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ ఈ.శ్రీనివాస రావు పాల్గొన్నారు.