
గచ్చిబౌలి, వెలుగు: ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు కోల్పోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జార్ఖండ్రాష్ర్టం బొకారో స్టీల్‌సిటీ ప్రాంతానికి చెందిన సుజిత్కుమార్పండిత్(24) నానక్‌రాంగూడలోని వాసవి జీపీ ట్రెండ్స్ అపార్ట్మెంట్‌లోని 17వ ఫ్లోర్‌లో మరో ఇద్దరితో కలిసి ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
సుజీత్ కొంతకాలంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తూ భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చేందుకు రూ.20 లక్షల వరకు లోన్లు తీసుకున్నాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన సుజిత్గురువారం సాయంత్రం 17వ ఫ్లోర్ నుంచి కిందికి దూకాడు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
కాగా అతని రూమ్‌లో ‘ఐ ట్రైడ్.. లూజర్’ అని రాసి ఉన్న పేపర్‌ను ల్యాప్‌టాప్‌కు అంటించాడు. సుజిత్ సోదరుడు అజిత్కుమార్పండిత్ బెంగుళూరు నుంచి హైదరాబాద్ చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.