Reading Time: < 1 minute

జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టుల అటాక్..ఓ వలస కూలీ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Caption of Image.

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లా కెల్లమ్ గ్రామంలో ఇద్దరు స్థానికేతర కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన భూపేందర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కెల్లమ్  ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.  భద్రతా బలగాలు టెర్రరిస్టుల  కోసం గాలిస్తున్నాయి.

గత వారం అనంతనాగ్‌లో జరిగిన టార్గెటెడ్ దాడిలో ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. వరుస హత్యలు జరుగుతుండడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. సుమారు మూడు వేలకు పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను నిర్బంధిస్తే పరిస్థితి దిగజారే ప్రమాదం ఉందని అధికారులను జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా హెచ్చరించారు. 

©️ VIL Media Pvt Ltd.