
భర్త చనిపోతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలని సినీ నటి అనసూయ సందేహం వ్యక్తం చేసింది. ఈ ఆలోచన మూడేళ్ల నుంచి తనను తినేస్తుందని ఆమె చెప్పింది. తన తండ్రి చనిపోయి మూడేళ్లు అయిందని.. అప్పటి నుంచి తన తల్లి బొట్టు, గాజులు లేకుండా ఉండటంపై అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది.
తన తల్లి బొట్టు కింద బొట్టు పెట్టుకుని, కాటుక పెట్టుకుని చాలా అందంగా ఉంటుందని అనసూయ చెప్పింది. బొట్టు, కాటుక, గాజులు ఇవన్నీ తన తల్లికి ఆమె తల్లి పెట్టిందని.. తనకు బొట్టు, కాటుక తన తల్లి పెట్టిందని.. ఒకవేళ వీటన్నింటినీ వదిలేయాల్సి వస్తే.. అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ వదిలేయాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.
వీటన్నింటినీ భర్తకు ముడి పెట్టి.. భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయడం ఏంటనేది తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అనసూయ చెప్పింది. అది వాళ్ల పర్సనల్ ఛాయిస్ కదా.. అలాంటిది భర్త మరణానికి ముడి పెట్టడం ఏంటని అనసూయ విస్మయం వ్యక్తం చేసింది. చాలా బలవంతమైన రూల్స్ కొన్ని రుద్దబడినట్టుగా వీటిని చూస్తే అనిపిస్తూ ఉంటాయని అనసూయ చెప్పడంతో కొందరు ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డారు.
►ALSO READ | OTT Thriller: ఓటీటీలో సస్పెన్స్ ట్విస్టులతో తెలుగు థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సనాతన ధర్మం, ఆచారాలపై అవగాహన లేకపోతే మాట్లాడకూడదని.. ఇలా మాట్లాడటం సరికాదని కొందరు నెటిజన్లు ఆమె తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ వీడియో కింద కామెంట్స్ చేశారు. మరికొందరు ఆమె వాదనను సమర్థించారు. అనసూయ తెరపైకి తెచ్చిన ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.