Reading Time: < 1 minute

పోలీస్ జీప్ బ్రేకులు ఫెయిల్.. చెట్టును ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి

Caption of Image.

విజయనగరం: పోలీసు వాహనం బోల్తా పడి కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయనగరం జిల్లా కొండకరకాం దగర్గ ఈ దుర్ఘటన జరిగింది. ఒక కేసు దర్యాప్తు కోసం విజయనగరం రూరల్‌ పోలీసులు జీపులో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కొండకరకాం వెళ్తున్నారు. ఈ క్రమంలోనే.. కొండకరకాం ఘాట్‌ దగ్గర బ్రేకులు ఫెయిల్‌ కావడంతో జీపు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి.

SI అశోక్‌కుమార్‌, కానిస్టేబుళ్లు నాగేంద్ర, వెంకటరమణ, డ్రైవర్‌ రాజాబాబుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ వెంకట రమణ (49) చనిపోయాడు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.