Reading Time: 2 minutes
Video: వికెట్ తీశాక ఓవరాక్షన్.. లంక బౌలర్‌ దూల తీర్చిన జైస్వాల్.. అసలేం జరిగిందంటే?

Yashasvi Jaiswal vs Asitha Fernando Fight: కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాలేలో జరిగిన తొలి టెస్టు గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. భారత జట్టులో కుల్దీప్ యాదవ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా దూరమవగా, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరోవైపు లంక జట్టులో కమిందు మిశ్రా అరంగేట్రం చేశాడు.

ఓపెనర్ల నిష్క్రమణ.. జైస్వాల్ అర్ధశతకం మిస్..

బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి లాహిరు కుమార బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతూ అర్ధశతకానికి చేరువయ్యాడు. 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు అసిత ఫెర్నాండో వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 66 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది.

ఎక్కువమంది చదివినది: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!

మైదానంలో జైస్వాల్, ఫెర్నాండో వాగ్వాదం..

జైస్వాల్ వికెట్ పడగొట్టిన వెంటనే అసిత ఫెర్నాండో అత్యుత్సాహం ప్రదర్శించాడు. పెవిలియన్ వైపు వెళ్తున్న జైస్వాల్‌ను ఉద్దేశించి ఏదో అనడంతో వివాదం రాజుకుంది. లంక బౌలర్ మాటలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జైస్వాల్, వెనక్కి తిరిగి వచ్చి ఫెర్నాండోకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఇరు ఆటగాళ్ల మధ్య మాటామాటా పెరగడంతో పరిస్థితి వేడెక్కింది. వెంటనే లంక ఫీల్డర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది.

ముగిసిన తొలి రోజు.. భారీ స్కోర్ దిశగా భారత్..

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. క్రీజులో జురేల్ (7 పరుగులు), సారాంష్ జైన్ (4 పరుగులు) క్రీజులో ఉన్నారు. ఇక జైస్వాల్ 45, కేఎల్ రాహుల్ 18, పడిక్కల్ 117, శుభ్మన్ గిల్ 50 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రిషబ్ పంత్ 3 పరుగులకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. జడేజా మరో కీలక ఇన్నింగ్స్ ఆడి 43 పరుగులు చేసి పెవలియన్ చేరాడు.

ఎక్కువమంది చదివినది: SL vs IND 2nd Test: శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!

మైదానంలో స్లెడ్జింగ్‌కు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడి చేయడంలో యశస్వి జైస్వాల్ దూకుడు మరోసారి స్పష్టమైంది. తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, మిడిలార్డర్ బ్యాటర్లు నిలబడితేనే భారత్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించే వీలుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..