ఆచార్య చాణక్యుడు బంధాలు బంధుత్వాలు మాత్రమే కాకుండా, జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో కూడా తప్పకుండా కొన్ని సూచనలు పాటించాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నేటి సంబంధాలు, జీవనశైలి వాటన్నింటిని గుర్తు పెట్టుకొని, జీవితం ఆనందంగా ఉండాలి అంటే తప్పకుండా తనకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ, ఈ లక్షణాలు మాత్రం తప్పకుండా ఉండాలి అని తెలియజేయడం జరిగింది. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తి ఇతరులతో ఎలా మాట్లాడుతాడు, వారితో ప్రవర్తించే విధానం గురించి తెలుసుకోవాలి. స్నేహితులు, తల్లిదండ్రులు, సహోద్యోగులతో ఉండే విధానం , మాట్లాడే విధానం గమనించాలి. ఇతరులను వారి అభిప్రాయాలను గౌరవిస్తాడా ? లేదా అని తెలుసుకోవాలి. దాని వలన అసలైన వ్యక్తిత్వం తెలుస్తుందంట.
కష్ట సమయాల్లో తాను వ్యవహరించే తీరు, ప్రవర్తించే విధానం కూడా తెలుసుకోవాలని చెబుతున్నాడు చాణక్యుడు. అంతా సాఫీగా ఉండే సమయంలో ప్రతి ఒక్కరూ చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టం వచ్చినప్పుడు మాత్రమే అతని నిజస్వరూపం బయటపడుతుంది. ఆ సమయంలో అతను దానిని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాడా? కోపంలో ఇతరులను నిందిచడం చేస్తాడా అనేది గమనించాలని చెబుతున్నాడు చాణక్యుడు.
ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తున్నాడు కదా అని భాగస్వామిని ఎంచుకుంటే సరిపోదు. తాను తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలడా? భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటాడా? తన బాధ్యతలను స్వీకరించడానికి సంకోచిస్తాడా? వీటన్నింటి గురించి కూడా ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.
అంతే కాకుండా పెళ్లికి ముందే ఆ వ్యక్తి స్త్రీల పట్ల చూపించే వైఖరి గురించి తెలుసుకోవాలని చెబుతున్నాడు చాణక్యుడు. అతను స్త్రీ స్వేచ్ఛకు ఎంత గౌరవం ఇస్తాడు. అంతే కాకుండా కుటుంబంలోని స్త్రీలతో ఎలా ప్రవర్తిస్తాడు, వారిని ఎలా గౌరవిస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడా లేదా ఇలా అన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు, అతనికి ఆస్తిపాస్తులు లేకున్నా పెళ్లి చేసుకోవచ్చు అని చెబుతున్నాడు చాణక్యుడు




