
Abhishek Sharma: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో బంతిని నలుమూలలా బాదుతూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడిన అభిషేక్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే రేంజ్‌లో రికార్డు సెంచరీ నమోదు చేశాడు.
30 బంతుల్లోనే వంద.. వరల్డ్ రికార్డ్ బద్దలు:
మ్యాచ్ ఆరంభం నుంచే మోత మోగించిన అభిషేక్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్ జట్టు బౌలర్లకు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 భారీ సిక్సర్లు, 10 ఫోర్లతో గ్రౌండ్ అంతటా బౌండరీల సునామీ సృష్టించాడు.
ఐసీసీ ఫుల్ మెంబర్స్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ:
ఈ విధ్వంసంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ సరికొత్త ఆల్-టైమ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ (పర్మనెంట్) జట్ల తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ (Fastest Century) నమోదు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కాగా ఈ రికార్డు ఇప్పటి వరకు న్యూజిలాండ్ ప్లేయర్ ఆలెన్ (33 బంతుల్లో 100 పరుగులు) పేరుపై ఉండేది. కాగా ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లని చెడుగుడు ఆడుతూ అభిషేక్ చేసిన ఈ ఇన్‌సేన్ రాంపేజ్‌తో ఢిల్లీ స్టేడియం ఊగిపోయింది.
1⃣0⃣8⃣ runs
3⃣4⃣ balls
3⃣1⃣7⃣.6⃣5⃣ strike rate
9⃣ fours & 1⃣1⃣ sixesAbhishek Sharma walks back after a fabulous knock 💥💥
Updates ▶️ https://t.co/Zixki4RhPt#TeamIndia | #AFGvIND pic.twitter.com/tMPK8itRXT
— BCCI (@BCCI) September 17, 2026