
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాక'(KAAKA) . అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు మేకర్స్ శుభం కార్డ్ వేసేశారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
చిరంజీవి నటిస్తున్న మరో సోషియో ఫాంటసీ చిత్రం’విశ్వంభర’ రిలీజ్ వాయిదా పడుతుండటంతో.. దాని కోసం ‘కాక’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ KVN ప్రొడక్షన్స్ సంస్థ జనవరి 13 రిలీజ్‌ను మరోసారి -కన్ఫర్మ్ చేసింది. అంతేకాకుండా, త్వరలోనే ఈ సినిమా నుంచి ‘ఫస్ట్ సింగిల్’ వదలబోతున్నట్లు ప్రకటించి మెగా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది.
ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి ఊరమాస్ బాణీలు సమకూరుస్తున్నారు. వెంకట్ నారాయణ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ALSO READ : తెలుగోళ్లకి తెలుగువారే శత్రువులు..
మరోవైపు ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా దాని రిలీజ్ డేట్‌పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఏది ఏమైనా, 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ‘కాక’ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది..
Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥
Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027.
First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy
— KVN Productions (@KvnProductions) September 17, 2026