Reading Time: < 1 minute
Kayadu Lohar: సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కయాదు లోహర్

ఇద్దరూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లు. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో దూసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు ఒకరు వరుస హిట్స్ అందుకుంటుంటే.. మరొకరు ఫ్లాపులతో రేసులో వెనకబడిపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్‌ ఈ స్టోరీలో చూద్దాం. మమితా బైజు పట్టిందల్లా బంగారం అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో 260 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. మలయాళంలోనూ ‘బెత్లహం కుటుంబ యూనిట్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. మరోవైపు కయాదు లోహర్ మాత్రం కెరీర్‌లో తడబడుతున్నారు. వరుసపెట్టి సినిమాలు చేసినా ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో చేసిన ‘ఐ యామ్ గేమ్’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంచనా వేసినా.. డిజాస్టర్‌గా మిగిలింది. తమిళంలో జీవీ ప్రకాశ్‌తో చేసిన ‘ఇమ్మోర్టల్’ కూడా నిరాశపరిచింది. ఒక్క ఇదయం మురళి తప్ప ఈ బ్యూటీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ కనిపించటం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కయాదు, ‘ది ప్యారడైజ్’ సినిమాపైనే తన ఆశలు పెట్టు్కున్నారు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకొని స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని కష్టపడుతున్నారు. మరి ప్యారడైజ్‌తో అయినా కయాదు కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో మైథలాజికల్‌ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్‌ హీరోలు!

గ్లామర్‌ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్‌ హీరోయిన్ల కొత్త రూట్‌!

Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్‌ ధర ఎంతంటే!

పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?

USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌