Reading Time: 2 minutes
వేణుమాధవ్ చివరి రోజుల్లో నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే.. మరుసటి రోజే ఆ వార్త విని షాకయ్యా.. ఉదయభాను..

టాప్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా కాలం సైలెంట్ అయిన ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన విజయం వెనుక అండగా నిలిచిన భర్త గురించి, అలాగే టాలీవుడ్‌కు తీరని లోటు కలిగించిన దివంగత నటులు వేణుమాధవ్, రాకేష్ మాస్టర్‌లతో తనకున్న అనుబంధం గురించి ఆమె వివరించారు. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వేణుమాధవ్ తనను చిన్నతనం నుండి చూశాడని, తన బలహీనతలు, భావోద్వేగాలు ఆయనకు తెలుసని ఉదయభాను అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

వేణుమాధవ్ ఇతరులతో అల్లరి చిల్లరగా, నోటి దురుసుగా మాట్లాడినా, తనను మాత్రం ఎప్పుడూ గౌరవించేవాడని ఆమె తెలిపారు. వారిద్దరూ కలిసి చేసిన వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. వేణుమాధవ్ చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఫోన్ చేసి “వాళ్లు అబద్ధం చెబుతున్నారు, నేను బాగున్నాను” అని చెప్పినా, “దయచేసి ఆరోగ్యం కాపాడుకో” అని తాను అన్నానని గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజే ఆయన మరణవార్త విని షాకయ్యాయని, పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన నిజాయితీ, కష్టపడే తత్వాన్ని చెప్పుకొచ్చారు. డి షో సమయంలో తాను చూసిన రాకేష్ మాస్టర్ ఒక మంచితనానికి, డాన్స్‌కు ప్రతీక అని, కానీ తదనంతర కాలంలో యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఆయన జీవితం వేరే మలుపు తీసుకుందని ఉదయభాను అన్నారు. రాకేష్ మాస్టర్ కష్టజీవి అని, తన దగ్గర ఏమీ లేకపోయినా ఇతరులకు సహాయం చేసే రకం అని, తన ఆస్తులు, సంపాదన అన్నీ ఇతరుల కోసమే ఖర్చుపెట్టారని తెలిపారు. యూట్యూబ్ ఛానెళ్లకు వచ్చిన తర్వాత ఆయన జీవితం అనూహ్య మలుపులు తిరిగినప్పటికీ, ఆయనలోని మంచితనం మారలేదని, అది చివరి వరకు కొనసాగిందని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఈ ముగ్గురితో తన అనుబంధాన్ని పంచుకుంటూ, వారు పరిశ్రమకు అందించిన సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..