
- స్టూడెంట్లకు సూచించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
- షేర్ది విజన్ఆధ్వర్యంలో 600 బ్యాగులు, మెటీరియల్పంపిణీ
కోల్‌బెల్ట్, వెలుగు: క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్స్కూల్లో షేర్ది విజన్ ఖమ్మం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం బ్యాగులు, స్పోర్ట్స్మెటీరియల్ను కలెక్టర్ కుమార్ దీపక్, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధి నారాయణతో కలిసి మంత్రి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను గతంలో స్కూల్‌ను సందర్శించిన సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రిన్సిపాల్, టీచర్లు తన దృష్టికి తీసుకవచ్చారన్నారు.
దీంతో డీఎంఎఫ్టీ నిధులు రూ.30లక్షలు, రూఫింగ్పనులకు సింగరేణి కంపెనీ నుంచి రూ.60లక్షల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. షేర్ది విజన్ సంస్థ ద్వారా 600 మంది విద్యార్థులకు బ్యాగులు, స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో త్వరలో మంచిర్యాలలో సైనిక్ స్కూల్తరహాలో స్కూల్మంజూరు కానుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, జిల్లా స్పోక్స్‌పర్సన్ ఎండీ అబ్దుల్అజీజ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపల్ కమిషనర్లు మురళీకృష్ణ, రాజలింగు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
అనారోగ్యంతో మృతిచెందిన మందమర్రి టౌన్బీఆర్ఎస్ ప్రెసిడెంట్ జె.రవీందర్, చెన్నూరులోని పద్మనగర్ కాలనీకి చెందిన సంబోజు నితిన్కుటుంబాలను మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి వెంట కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.