Reading Time: 2 minutes
Modi Jinping Is It Ok New Video Brics Summit

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆరోగ్యం బాగోలేదని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ.. జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ‘‘ఇట్స్ ఓకే?’’ అని అడిగినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిన్‌పింగ్ ఆరోగ్యాన్ని ఉద్దేశించే మోడీ అలా అడిగినట్లుగా రకరకాలైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మాటల వెనుక ఏదో మర్మం ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదేమీలేదని మరికొందరు ఖండిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12-13 తేదీల్లో భారత్ మండపంలో బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరయ్యారు. సదస్సులో దేశాధినేతలు పలు అంశాలపై మాట్లాడారు. అయితే జిన్‌పింగ్ ఇయర్‌పీస్‌లో ఏదో సమస్య వచ్చింది. దీంతో ఆయన సరి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘‘ఇట్స్ ఓకే?’’ అని సంబోధించారు. తాజాగా రష్యా ప్రభుత్వ ప్రసార సంస్థ రొస్సియా-1 చిత్రీకరించిన వీడియోలో ఈ విషయాలు కనిపిస్తున్నాయి. వీడియోలో ఉన్న సందర్భాన్ని బట్టి చూస్తే.. మోడీ అడిగిన “ఇట్స్ ఓకే?” అన్న మాటలు జిన్‌పింగ్ ఆరోగ్యానికి సంబంధించినవి కాకుండా.. అనువాద పరికరంలో తలెత్తిన సమస్యకు సంబంధించినవై ఉండొచ్చనే చర్చ మొదలైంది. అయితే ఆ సమయంలో ఇరువురు నేతలు పూర్తిగా ఏం మాట్లాడుకున్నారో మాత్రం వీడియోలో తెలియలేదు.

ఈ చిన్న సంభాషణ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మోడీ ఆ మాట ఎందుకు అన్నారనే దానిపై పలువురు నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేశారు. మరికొందరు దీనిని జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితితో ముడిపెడుతూ ఊహాగానాలు చేశారు. అయితే మోడీ వ్యాఖ్యకు కచ్చితమైన కారణమని చెప్పడానికి ఆధారం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఊహాగానాలకు బ్రేక్?

కొత్త వీడియో బయటకు రావడంతో గతంలో వైరల్ అయిన క్లిప్‌పై సోషల్ మీడియాలో జరిగిన చర్చకు మరో కోణం వచ్చింది. కొందరు నెటిజన్లు గతంలో జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన ఊహాగానాలను విమర్శించారు. మరికొందరు “కుట్ర సిద్ధాంతాలను పక్కన పెట్టండి” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక మోడీ వ్యాఖ్యపై కథనాలు ప్రచురించడంపై పలువురు తప్పుబడుతున్నారు. ఇక సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఖండించింది.