
KAAKA: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాక’ (KAAKA) విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు చిత్రబృందం ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
‘కాక’ రిలీజ్ డేట్‌పై కొంతకాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ అధికారిక ప్రకటన చేశారు. ‘కాక’ మూవీ జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది అని వెల్లడించారు. దీంతో మెగాస్టార్ సినిమా సంక్రాంతి రేసులో ఉండబోతున్నట్లు మరోసారి స్పష్టమైంది.
ఇదివరకు చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి జతకట్టడంతో ‘కాక’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, కమర్షియల్ అంశాలతో దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. అభిమానులకు మరో ట్రీట్ కూడా ఇచ్చారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగాస్టార్ అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు సంక్రాంతి 2027 రేసులో ‘కాక’ అధికారికంగా తన స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో.. వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.
Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027
Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027.
First Single Soon
#KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy
— KVN Productions (@KvnProductions) September 17, 2026

