Reading Time: < 1 minute

వినాయకచవితి అవ్వగానే తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

Caption of Image.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఆందోళనలతో పాటు యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్లు ఎలాంటి ట్రెండ్ లేకుండా గందరగోళంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందటి వరకూ భారీగా పెరిగిన బంగారం ధరలు ఉన్నట్లుండి తగ్గుముఖం పట్టడం స్టార్ట్ చేశాయి.  ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించటం బెటర్. 

సెప్టెంబర్ 15న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. సెప్టెంబర్ 14 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.92 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 317గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 040గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 15, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.
 

©️ VIL Media Pvt Ltd.