Reading Time: 2 minutes

ఎంగేజ్‌మెంట్ జరిగిన 6 నెలలకే బ్రేకప్: పృథ్వీ షా లవ్‌స్టోరీకి షాకింగ్ ఎండ్ కార్డ్.. అకృతి సంచలన పోస్ట్!

Caption of Image.

Prithvi Shaw, Akriti Agarwal Breakup: టీమిండియా యంగ్ బ్యాటర్ పృథ్వీ షా లవ్‌స్టోరీకి ఊహించని షాకింగ్ ట్విస్ట్ పడింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన కేవలం ఆరు నెలలకే వీరిద్దరూ విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉన్న ఈ క్రేజీ జోడీ, సైలెంట్‌గా తమ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుని విడిపోతున్నట్లు పెద్ద బాంబు పేల్చారు.

మా దారులు వేరయ్యాయి.. అకృతి ఎమోషనల్ పోస్ట్: 

* ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అకృతి అగర్వాల్ ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేస్తూ తమ బ్రేకప్‌ను అధికారికంగా ఖరారు చేసింది. నా నిశ్చితార్థం రద్దయిన విషయాన్ని  ఎంతో భారమైన హృదయంతో వెల్లడిస్తున్నా.. భవిష్యత్తుపై మా ఇద్దరి లక్ష్యాలు, ఆలోచనలు వేరుగా ఉండటంతోనే పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.. ప్రేమ ఉంది కానీ, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మాకున్న బాధ్యతలు, పరిస్థితుల దృష్ట్యా విడిపోవడమే మంచిదని భావించాం.. మున్ముందు మా ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అని అకృతి రాసుకొచ్చింది.

జూలైలోనే మోగిన బ్రేకప్ సైరన్.. చీటింగ్ రూమర్స్: 

మార్చిలో పృథ్వీ షా, అకృతి ఎంగేజ్‌మెంట్ వేడుకగా జరిగింది. నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ రిలేషన్‌షిప్‌ను ప్రమోట్ చేసుకున్నారు.

* క్రిప్టిక్ పోస్ట్ రచ్చ: జూలై నెలలో అకృతి చేసిన ఒక నిగూఢమైన (Cryptic) సోషల్ మీడియా పోస్ట్ పెద్ద తుఫానే రేపింది. మోసం (Cheating) గురించి ఆ పోస్ట్‌లో ఉండటంతో, పృథ్వీ షానే ఆమెను మోసం చేశాడని నెటిజన్లు ఊహాగానాలు స్టార్ట్ చేశారు. 

* క్లారిటీ ఇచ్చినా ఫైదా లేదు: ఆ పోస్ట్ పృథ్వీ షా గురించి కాదు, తన స్నేహితుల గురించని అకృతి ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. కానీ అప్పటి నుంచే వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయనే ప్రచారం మొదలైంది.

రూమర్స్ ఆపండి.. ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వండి: 

* తాము విడిపోవడానికి గల అంతర్గత పరిస్థితులను బయటకు చెప్పని అకృతి, అభిమానులకు ఒక విజ్ఞప్తి చేసింది. ఈ క్లిష్ట సమయంలో తమ ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించవద్దని, కారణాలపై అనవసరమైన ఊహాగానాలు లేదా నిందారోపణలు చేయవద్దని కోరింది.

►ALSO READ | వెస్టిండీస్‌తో భారత్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ XI ఇదే: మరీ ఆకిబ్ నబీకి గిల్ ఛాన్స్ దక్కేనా? 

©️ VIL Media Pvt Ltd.