
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది టీటీడీ. సదరు ఫోటోలో ఉన్నది అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదమే కాదని కొట్టిపారేసింది టీటీడీ. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యమని పేర్కొంది టీటీడీ.
వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని స్పష్టం చేసింది టీటీడీ. లడ్డూ తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందని.. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపింది .
అయితే కొందరు అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని… భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది టీటీడీ.
►ALSO READ | అక్టోబర్ 1న కృష్ణా బోర్డు మీటింగ్