Reading Time: < 1 minute

సీజ్ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్ కొట్టేశారు: సీఎం రేవంత్

Caption of Image.

తెలంగాణలో భూములకు సంబంధించి 22A అంశంపై బుధవారం ( సెప్టెంబర్ 16 ) అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. సీజ్ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్ కొట్టేశారని అన్నారు. ఈ భూములు కేటీఆర్ భార్య, అత్త మామల పేర్ల మీద బదిలీ చేయించుకున్నారని అన్నారు. ప్రభుత్వం సీజ్ చేసిన భూములు బదిలీ అవుతాయని ప్రశ్నించారు సీఎం రేవంత్.

ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ ఫ్యామిలీ అడ్డగోలుగా భూములు దోచుకున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. రామలింగరాజు ఫ్యామిలీకి సంబంధించిన శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కేటీఆర్ భూములు బదిలీ చేయించుకున్నారని అన్నారు సీఎం రేవంత్.

►ALSO READ | అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ భూదందా లిస్ట్ బయటపెట్టిన సీఎం రేవంత్

ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలోని భూములపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. వందల ఎకరాల భూమి కేసీఆర్ ఫామ్ హౌస్ అధీనంలో ఉందని.. అందుకే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణకు ఆదేశిస్తున్నాని అన్నారు సీఎం రేవంత్. 30 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్.
 

©️ VIL Media Pvt Ltd.