Reading Time: 2 minutes
Bigg Boss 10 Telugu : పట్టాలెక్కిన లవ్ ట్రాక్.. పూల్‏లో వర్షిణితో ముఖేష్.. ఉతికారేసిన దేబ్జానీ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో హౌస్‌మేట్స్ మధ్య రోజురోజుకూ సరికొత్త వివాదాలతో రసవత్తరంగా సాగుతుంది. నిన్నటివరకు నామినేషన్స్ రచ్చ నడవగా.. మరోవైపు క్యూట్ లవ్ స్టోరీ పట్టాలెక్కింది. సెప్టెంబర్ 15 నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్, ముకేష్ గౌడ మధ్య జరిగిన చిన్నపాటి సరదా గొడవ ఎపిసోడ్ కే హైలెట్ కగా.. దెబ్జానీ మాటలు.. ముఖేష్ సంజాయిషీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గత వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ముందే ముఖేష్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టిన దేబ్జానీ, ఈ ఎపిసోడ్‌లోనూ అతడితో చాలా ఫన్నీగా, క్యూట్‌గా ఫ్లర్ట్ చేస్తూ సందడి చేసింది. తనకు వచ్చిన కొంచెం కొంచెం తెలుగుతో అటు హౌస్మేట్స్, ఇటు అడియన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ భామ. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వర్షిణితో కలిసి పూల్ లో సందడి చేసిన ముఖేష్ ను ఓ ఆటాడుకుంది దెబ్జానీ.

ఎపిసోడ్ ప్రారంభంలో త్రిగుణ్, సుధీర్ , రోహిత్‌ల మధ్య నామినేషన్స్ వివాదాలపై తీవ్రమైన చర్చలు నడిచాయి. అయితే, ఆ తర్వాత వాతావరణం ముఖేష్, దేబ్జానీ సరదా సంభాషణతో పూర్తిగా మారిపోయింది. ముఖేష్, వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సమయం గడిపి వాష్‌రూమ్ వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న దేబ్జానీని చూసి పొరపాటున ‘వర్షిణీ’ అని పిలిచాడు. దీంతో హాలో.. “నా ముఖం నీకు వర్షిణిలా కనిపిస్తుందా? నువ్వు నా దగ్గరకు రాకు” అంటూ ముకేష్‌ను ఆటపట్టించింది.

దానికి ముకేష్ వివరణ ఇస్తూ.. పూల్‌లో వర్షిణి వేరే అబ్బాయిని పొగుడుతుంటే విన్నానని చెప్పాడు. అయితే దేబ్జానీ వెంటనే అందుకుని, “అది కాదు మేటర్.. నాగ్ సర్ ముందే చెప్పాను కదా, నాకు నువ్వంటే ఇష్టమని!” అంటూ మరోసారి ప్రపోజ్ చేసింది. అంతటితో ఆగకుండా, “ఒక పరాయి ఆడదానితో, అది కూడా పూల్‌లో బట్టల్లేకుండా ఎలా దిగుతావు?” అంటూ సరదాగా నిలదీసింది. నాగ్ సార్ ముందు నువ్వంటే ఇష్టమని చెప్పాను కదా. నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు నువ్వు ఇష్టం అని చెప్పాను కదా అని దేబ్జానీ అంటుండగానే.. వచ్చినందుకు ఇష్టమా.. వచ్చిన తర్వాత ఇష్టమా అని అడిగాడు ముఖేష్. దీంతో అర్థం అదే వస్తుంది అంటూ డైలాగ్ కొట్టింది దేబ్జానీ. ఒక పరాయి ఆడదానితో నువ్వు స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్నావా? బట్టల్లేకుండా అమ్మాయితో పూల్‌లో ఉంటావా? అంటూ గట్టిగానే నిలదీసింది దేబ్జానీ. దానికి అక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారని ముకేష్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

ఈ గొడవలోకి వర్షిణి, రాంప్రసాద్ కూడా ప్రవేశించడంతో సీన్ మరింత నవ్వులు పూయించింది. మా చెల్లి అన్యాయం చేస్తుందని తెలుసు.. కానీ వీడు మా చెల్లికే అన్యాయం చేస్తున్నాడు. వీళ్లిద్దరికి కెర్ట్ కాదనిపిస్తుంది అంటూ తనస్టైల్లో పంచ్ వేశాడు రామ్ ప్రసాద్. ముఖేష్ నాకు అన్యాయం చేస్తున్నాడంటూ అలగింది దేబ్జానీ. ఇక మధ్యలోకి వర్షిణి రావడంతో నువ్వు ఆమెకు లాయర్ వా అంటూ కౌంటర్ ఇచ్చింది. “నేను త్రిగుణ్‌కి కాఫీ మాత్రమే ఇచ్చాను, కానీ నువ్వు ఆమెతో పూల్‌లోకి దిగావు” అని దేబ్జానీ క్యూట్‌గా అరచింది దేబ్జానీ. “వచ్చే కొత్తవాళ్లతో నేను కూడా పూల్‌లో దిగి నేనేంటో నీకు చూపిస్తా” అంటూ దేబ్జానీ వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి సీరియస్ నామినేషన్ల మధ్య దేబ్జానీ, ముకేష్‌ లవ్ ట్రాక్ , వర్షిణితో ముకేష్ పూల్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.