Reading Time: 2 minutes
నేను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. కొందరు కమిట్మెంట్స్ అడిగారు..! పొలిమేర బ్యూటీ  సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ సినిమాలు ఓటీటీతో పాటు థియేటర్లలోనూ ఆకట్టుకుంటున్నాయి. అలా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రాల్లో మా ఊరి పొలిమేర కూడా ఒకటి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. చేతబడి, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను ఉత్కంఠభరితంగా చూపించడంతో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన పొలిమేర 2 థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల, సాహితి దాసరి హీరోయిన్లుగా కనిపించారు. ముఖ్యంగా గెటప్ శ్రీను భార్య పాత్రలో నటించిన సాహితి దాసరి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

పొలిమేర 2 సినిమాలో సాహితి దాసరి తన పాత్రకు తగిన విధంగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ లుక్‌తో ఆకట్టుకోవడంతో పాటు, తన నటనతోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాతో ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు లభించింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి సాహితి దాసరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సాహితి దాసరి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో తనకు క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురైందని తెలిపింది. కొందరు దర్శకులు, నిర్మాతలు తనను కమిట్మెంట్స్ అడిగారని ఆమె అన్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనలు చాలాసార్లు నేరుగా దర్శకులు లేదా నిర్మాతల నుంచి రావని, కోఆర్డినేటర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ల వంటి మధ్యవర్తుల ద్వారా తమకు దగ్గరకు వస్తాయని ఆమె తెలిపారు. కొందరు మధ్యవర్తులు దర్శకులతో సన్నిహితంగా ఉండాలని, మెసేజ్‌ల ద్వారా మాట్లాడాలని, నంబర్ ఇస్తామని, అలా చేస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని ఇన్ డైరెక్ట్ గా చెప్తారని ఆమె అన్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనలను తాను తిరస్కరించానని.. దాని వల్ల కొన్ని ప్రాజెక్టుల్లో అవకాశాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని సాహితి అన్నారు. అలాగే తక్కువ సమయంలో పెద్ద స్థాయికి చేరుకోవడం కంటే, నెమ్మదిగా ఎదిగి ఎక్కువకాలం పరిశ్రమలో కొనసాగడమే ముఖ్యమని ఆమె అన్నారు. “ఎంత చిన్నగా ఎదిగితే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటాం. ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడూ నిలవదు” అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని సాహితి చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Sahithi Dasari (@sahithi_dasari7)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.