
రాత్రి సమయంలో కాళ్ళు లాగుతున్నట్లు అనిపిస్తున్నాయని చాలామంది చెబుతుంటారు. ఈ కారణంగా సరిగ్గా నిద్రపోలేక ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది సాధారణ సమస్య కాదని.. నరాలకు సంబంధించిన సమస్య అని అంటున్నారు డాక్టర్లు. దీనిని రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ ( RLS ) అంటారట. ఈ సమస్యం ఉన్నవారికి కాళ్ళ లోపాలు భాగం పాకుతున్నట్లు, లాగుతున్నట్లు, జలదరిస్తున్నట్లు అనిపించడం, నొప్పిగా ఉండటం లేదా మండుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు డాక్టర్లు.
కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఒకే చోట ఉండకుండా కదలడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అయితే, ఈ ఉపశమనం తాత్కాలికమే.. ఈ లక్షణాలు పదేపదే వస్తుండటం వల్ల నిద్రకు ఇబ్బంది తలెత్తుతుంది.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ కు కారణాలు:
రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనేది మెదడులో డోపమైన్ వ్యవస్థలో వచ్చే మార్పులతో పాటు ఐరన్ లోపం వల్ల కూడా వస్తుందని చెబుతున్నారు వైద్యులు.ఇది వంశపారపర్యంగా కూడా ఉండవచ్చని.. గర్భధారణ సమయంలో కూడా సాధారణంగా వస్తుందని చెబుతున్నారు.కిడ్నీ వ్యాధులు, షుగర్, పెరిఫెరల్ న్యూరోపతి వంటి సమస్యలు కూడా RLS లక్షణాలకు దారి తీస్తాయని చెబుతున్నారు.
RLS లక్షణాలు:
సాధారణ లక్షణాలలో కొన్ని:
- కాళ్లను కదపాలని అనిపించడం
- కాళ్ళలో జలదరింపు, పాకుతున్నట్లు అనిపించడం, నొప్పి, అసౌకర్యంగా అనిపించడం
- విశ్రాంతి సమయంలో, ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ ఇబ్బంది
- కాళ్లను కదిలించిన తర్వాత తాత్కాలిక ఉపశమనం
- నిద్ర పట్టడంలో ఇబ్బంది, నిద్రకు సంబంధించిన సమస్యలు
- నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల పగటిపూట నిద్రమత్తుగా ఉండటం
జీవనశైలిలో మార్పులే పరిష్కారం:
తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, వ్యాయామాలలో స్ట్రెచింగ్‌ను చేర్చడం వంటివి RLS ను నియంత్రించడంలో సాయపడతాయని… కాఫీ, మద్యం తగ్గించడం కూడా సాయపడుతుందని సూచిస్తున్నారు.
కొన్ని మందులు తీసుకున్న తర్వాత RLS లక్షణాలు కనిపించినా, తీవ్రమైనా, ఆ మందుల గురించి డాక్టర్ ను సంప్రదించడం మంచిదని అంటున్నారు.
►ALSO READ | Hair beauty : జుట్టు ఒత్తుగా ఉండి.. పొడి లేకుండా ఉండేందుకు ఇంటి చిట్కాలు ఇవే..!
మీ శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల కూడా RLS కలగవచ్చని.. ఐరన్ లెవెల్స్ తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్.
డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి:
ఎప్పుడైనా ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ.. తరచూ ఇలాంటి లక్షణాలు కనిపించినా క్రమంగా తీవ్రం అవుతున్నా… నిద్రకు, పనికి ఆటంకం కలిగించే స్థాయికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ను కలవాలని సూచిస్తున్నారు.
తరచుగా కనిపించే లక్షణాలు, నిద్రకు అంతరాయం కలగడం వల్ల పగటిపూట అధిక నిద్రమత్తుకు కూడా దారితీస్తాయి.. అలాంటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి.
న్యూరో సర్జన్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
RLS ఉన్న చాలా మందికి న్యూరోసర్జన్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదు. లక్షణాలతో పాటు వెన్నెముక, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యను సూచించే సంకేతాలు ఉన్నప్పుడు న్యూరోసర్జన్ ను కలవాలని అంటున్నారు.
ఈ లక్షణాలతో పాటు బలహీనత, తిమ్మిరి, నడవలేకపోవడం, మూత్ర, మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, నడుము నొప్పి వంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే ఈ లక్షణాలు RLS అని స్వయంగా నిర్దారణకు రావద్దని.. తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలని అంటున్నారు వైద్యులు.