
సర్దార్ వల్లబాయి పటేల్ కృషితో హైదరాబాద్ భారత్ లో విలీనమైందని అన్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. 2026 సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేగ్ గ్రౌండ్స్ లో కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హాజరైన ఉపరాష్ట్రపతి.. పటేల్ పోలీస్ చర్యలతో ఈ ప్రాంతానికి స్వాంతంత్ర్యం వచ్చిందని అన్నారు.
తెలంగాణ పోరాట యోధులకు ఘననివాళి అర్పించారు. రాంజీ గోండు, కొమురం భీం సేవలు మరువలేమని కొనియాడారు. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలోతో విముక్తి కలిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ భద్రతకు కేంద్రం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, మావో రహిత భారత్ కోసం షా కృస్తున్నట్లు చెప్పారు.
అంతకు ముందు పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతిని బేగంపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్, రామచంద్రరావు, డీకే అరుణ, ఇతర బీజేపీ నేతలు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఉపరాష్ట్రపతి .. జాతీయ జెండా ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్లా పాల్గొన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి:
ఆగస్ట్ 15, 1947 భారత్‌కు స్వాతంత్య్రం వస్తే, తెలంగాణకు 13 నెలలు ఆలస్యంగా వచ్చిందన్నారు. సర్దార్ పటేల్ జోక్యంతో ఈ గడ్డపై మూడు రంగుల జెండా ఎగిరిందన్నారు. ఖాసీం రజ్వీ కిరాయి మూకలు చేసిన ఘోరాలను మరిచిపోలేదని తెలిపారు. కానీ, మన పాలకులు ఆనాటి అరాచకాలను తొక్కిపెడుతున్నారని.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.