
ప్రతి ఇంట్లో ఉండే ప్రధాన సమస్యల్లో స్విచ్ బోర్డులు నల్లగా మారడం కూడా ఒకటి. చాలా కాలం వినియోగించడం ద్వారా ఇవి వాటిపై దుమ్ము, దూళి పేరుకుపోతుంది. దీంతో అవి అశుభ్రంగా కనిపించడంతో పాటు ఇంటి అందాన్ని కూడా నాశనం చేస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు స్విచ్చ్ బోర్డు క్లిన్ చేయాలి అనుకుంటే.. ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి.. విద్యుత్ సరఫరా పూర్తి నిలిచిపోయిన తర్వాత మాత్రమే దాన్ని క్లీన్ చేసే పనిని స్టార్ట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం తడి చేతులతో ఎట్టిపరిస్థితుల్లోనూ బోర్డును ముట్టుకోవద్దు.
స్టెప్-1: మొదటగా మీరు పొడిగా ఉన్న ఓ మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోండి. దాని సహాయంతో బోర్డుపై ఉన్న పొడి దుమ్మును నెమ్మదిగా క్లీన్ చేయండి. స్విచ్‌ల అంచుల్లో ఉన్న దుమ్మును క్లీన్ చేసేందుకు పెయింటింగ్ బ్రష్‌ను కూడా వాడొచ్చు. ఇక్కడ మీరు గుర్ఓతించుకోవాల్సి మరో విషయం ఏమిటంటే.. పొరపాటున కూడా మీరు వాటర్, లిక్విడ్ క్లీనర్లను వాడకూడదు.
స్టెప్-2: మీ స్విచ్ బోర్డు బటన్స్‌పై ఎక్కవ మురికి ఉంటే మీరు తీసుకున్న క్లాత్‌ను కొద్దిగా తడిపి, వాటర్ మొత్తం పోయే పిండి.. ఆ బయటి ప్లాస్టిక్ భాగాన్ని మాత్రమే సున్నితంగా తుడవండి. ఆ వెంటనే మళ్లీ పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా పూర్తిగా తుడిచేయండి. అయితే నీటి చుక్కలు స్విచ్‌ల సందుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి.
స్టెప్-3: మీరు స్విచ్ బోర్డుపై క్లీన్ చేసేప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. బోర్డుపై ఎప్పుడూ నేరుగా నీటిని స్ప్రే చేయరాదు. తడిగా గుడ్డ లేదా స్పాంజ్‌తో అస్సలూ రుద్దకూడదు. అలాగే శుభ్రం చేసే సమయంలో కత్తులు, పిన్నులు వంటి పదునైన వస్తువులను అస్సలూ వినియోగించకూడదు.
స్టెప్-4: ఒకవేళ శుభ్రం చేసే సమయంలో తేమ బోర్డు లోపలికి వెళ్లింది అనిపిస్తే వెంటనే పవర్ ఆన్ చేయకుండా, ఎలక్ట్రీషియన్‌ను తీసుకొచ్చి.. ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో చెక్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదనుకుంటే మాత్రమే స్విచ్ ఆన్ చేయండి.అలాగే స్విచ్ బోర్డుపై పగుళ్లు, కాలిపోయిన గుర్తులు లేదా లూజ్ కనెక్షన్లు కనిపిస్తే శుభ్రం చేయడం కంటే ముందు ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి సరిచేయడం మంచిది. లేదా కొత్తవి మార్చుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.