
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. యంగ్ డైరెక్టర్ హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో మనోజ్ మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలకపాత్రలో నటిస్తోంది. ఈ రోజు ( సెప్టెంబర్ 15, 2026 ) ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఈ చిత్రంలో రమ్యకృష్ణ ‘కమలారెడ్డి’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ‘బాహుబలి’లోని శివగామిని మించిపోయేలా.. చేతిలో రక్తసిక్తమైన ఖడ్గం పట్టుకుని, శత్రువులను హతమార్చిన తీవ్రరూపంతో సింహాసనంపై కూర్చున్న ఈ పోస్టర్ చూస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే. ఈ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు మనోజ్, రమ్యకృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు.
1897 నుండి 1920ల నాటి బ్రిటిష్ పాలన, భారత స్వాతంత్ర్య పూర్వ నేపథ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మనోజ్‌కు జోడీగా ‘కేవీఆర్ఓకే’ ఫేమ్ మరియా రియాబోషాప్కా నటిస్తుండగా, సముద్రఖని, సీనియర్ నటి కాంచన, బాలీవుడ్ స్టార్ అభయ్ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ : యాంకర్ పై వాటర్ బాటిల్ విసిరిన రానా..
ఒకవైపు రమ్యకృష్ణ ‘ఘాటీ’, ‘జాట్’ , ఆర్‌జీవీ మూవీ ‘పోలీస్ స్టేషన్‌లో భూత్’ వంటి వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా.. మరోవైపు ‘డేవిడ్ రెడ్డి’లో ఆమె కమలారెడ్డి పాత్ర సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా త్వరలోనే థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది..
One look. The entire frame belongs to her. 🔥
Happy Birthday, @meramyakrishnan garu! ❤️🙏🏻 An honour to share the screen with you!
Presenting the ferocious #KamalaReddy from #DavidReddy. ⚔️
Just wait till you see her in action. 🔥#HBDRamyaKrishnan garu pic.twitter.com/MDcVqlEsiA
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 15, 2026