Reading Time: < 1 minute

తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి వర్షాలు..ఈ మూడు జిల్లాల వాళ్లు జాగ్రత్త

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈ రెండు రోజుల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

అలాగే సెప్టెంబర్ 21, 22 తేదీల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా

 

©️ VIL Media Pvt Ltd.