Reading Time: < 1 minute

వేటు వేస్తారని ముందే తెలిసిపోయిందా?: హర్మన్‌తో గొడవ.. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీకి నిగర్ సుల్తానా గుడ్‌బై?

Caption of Image.

Nigar Sultana: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా అహంకారం ప్రదర్శించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాకు అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. టీమిండియాపై చూపించిన వికృత వైఖరి క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపడంతో, బీసీబీ ఆమెపై బహిష్కరణ వేటు వేసేందుకు సిద్ధమయినట్లు పెద్దెత్తున్న టాక్ నడుస్తుంది. దీంతో బంగ్లా టీ20 జట్టు కెప్టెన్సీకి నిగర్ గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

జపాన్ నుంచి అర్జెంట్ లేఖ.. బీసీబీకి దండం: 

బీసీబీ తన పదవి ఊడదీస్తుందని ముందే పసిగట్టిన నిగర్ సుల్తానా, దారికొచ్చి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈరోజు (సెప్టెంబర్ 15న, మంగళవారం) జపాన్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్‌కి అత్యవసరంగా లేఖ పంపింది. ఏషియన్ గేమ్స్ పూర్తయిన వెంటనే టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతానని, బోర్డు వేటు వేసేలోపే పారిపోయే ప్రయత్నం చేసింది. ఆమె అభ్యర్థనను తమీమ్ ఇక్బాల్ తక్షణమే ఆమోదించారు.

భారత్‌తో పెట్టుకుంటే అంతే: 

* అహంకారానికి తగిన శాస్తి: మైదానంలో హర్మన్‌ప్రీత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా క్రీడాస్ఫూర్తిని తిలోదకాలు ఇచ్చిన సుల్తానాకు, మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

* కెరీర్‌కే ఎండ్ కార్డ్: భారత్‌ను తక్కువ అంచనా వేసి రాజకీయం చేయాలని చూసిన సుల్తానా, చివరకు స్వదేశీ బోర్డు ఆగ్రహానికి గురై కెప్టెన్సీ పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

* 2022 నుంచి టీ20 కెప్టెన్‌గా ఉంటూ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, భారత జట్టుపై చూపించిన ద్వేషం, వరుస పరాజయాలు ఆమె కెరీర్‌ను అధఃపాతాళానికి నెట్టేశాయి. టీమిండియాతో పెట్టుకుంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో నిగర్ సుల్తానా పతనం మరొకసారి నిరూపించింది.

►ALSO READ | ఇమ్రాన్ ఖాన్‌ కోసం ఆసీస్ దిగ్గజాల తిరుగుబాటు.. షెహబాజ్ ప్రభుత్వానికి దడ! 

©️ VIL Media Pvt Ltd.