Reading Time: 2 minutes

‘తండేల్’ నా కెరీర్‌లోనే గొప్ప మైలురాయి.. సైమా బెస్ట్ యాక్టర్ అవార్డుపై నాగచైతన్య పోస్ట్!

Caption of Image.

అక్కినేని నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూ తన నటవిశ్వరూపంతో సంచలనాలు సృష్టిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో శ్రీకాకుళం మత్స్యకారుల యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘తండేల్’ చిత్రంలో  రాజు పాత్రలో చైతూ జీవించేసిన తీరు అందరినీ ఫిదా చేసింది. ఉత్తరాంధ్రా యాస, భావోద్వేగాలు, దేశభక్తి కలగలిపిన సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. ఈ విశ్వరూపానికి ఇప్పుడు పురస్కారాల పరంపర కొనసాగుతోంది.

లేటెస్ట్ గా ప్రతిష్టాత్మక SIIMA (సైమా) అవార్డ్స్‌లో నాగచైతన్య బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని దక్కించుకుని నెట్టింట ట్రెండింగ్ టాపిక్ గా మారారు. విశేషమేమిటంటే.. ఒకే ఏడాదిలో ‘తండేల్’ చిత్రానికిగాను చైతూ అందుకున్న మూడో బెస్ట్ యాక్టర్ అవార్డు ఇది. మొదట తెలంగాణ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’, ఆ తర్వాత నేషనల్ లెవల్లో ‘INCA’ అవార్డ్స్, ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టేజ్ SIIMA అవార్డును ముద్దాడి అరుదైన అవార్డుల హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నారు..

ఈ హ్యాట్రిక్ విజయంపై చైతూ స్పందిస్తూ.. ‘తండేల్ నా కెరీర్‌లోనే ఒక గొప్ప మైలురాయి. ఈ పాత్ర ఒక నటుడిగా నాపై బాధ్యతను మరింత పెంచింది. నా నటనను గుర్తించిన సైమాకు, నన్ను నిరంతరం ప్రోత్సహించే అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. చైతూ ఖాతాలో పడిన ఈ క్రేజీ రికార్డ్‌తో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 

ప్రస్తుతం చైతన్య తన కెరీర్‌ను అత్యంత పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ శైలిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబరు 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘దూత 2’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మొత్తానికి ‘తండేల్’ తెచ్చిన ఊపుతో నాగచైతన్య రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది..

 

©️ VIL Media Pvt Ltd.