Reading Time: < 1 minute

పాల్వంచలో ఐరన్ వ్యాపారి షాపుల్లో సోదాలు..ఇంటెలిజెన్స్, జీఎస్టీ, యాంటీ ఎవేజన్ అధికారులు తనిఖీ

Caption of Image.

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ఐరన్ వ్యాపారి లక్షల విలువైన ఇనుమును దారి మళ్లించారన్న సమాచారంతో బుధవారం ఇంటెలిజెన్స్, జీఎస్టీ, యాంటీ ఎవేజన్ విభాగాల అధికారులు సోదాలు నిర్వహించారు. వ్యాపారి దుకాణాలు, ఇళ్లలో ఉదయం నుంచి పది మంది ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. 

ఇంటెలిజెన్స్, జీఎస్టీ సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సౌజన్య ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. వ్యాపార లావాదేవీలపై విచారణ జరుగుతున్నందున వివరాలు వెల్లడించలేమని అధికారులు తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన ఐరన్ లోడులను దారి మళ్లించి తక్కువ ధరకు విక్రయించి లెక్కలు చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారి పరారీలో ఉన్నట్లు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.