
Nubia NaviX Ultra: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నుబియా (Nubia) కొత్త నూబియా నావిక్స్ అల్ట్రా (Nubia NaviX Ultra) ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 200MP కెమెరా, 7100mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా AI ఆధారిత సిస్టమ్-లెవల్ ఏజెంట్ ఫీచర్లను ఇందులో ప్రత్యేకంగా అందించారు.
200MP కెమెరా
కొత్త స్మార్ట్ ఫోన్ లో కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 200MP మెయిన్ కెమెరాను OISతో అందించారు. దీనికి 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా జతగా ఉన్నాయి. టెలిఫొటో మ్యాక్రోకు కూడా OIS సపోర్ట్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. AI ఇమేజ్ మాస్టర్, వాయిస్ ఆధారిత ఫ్రేమింగ్ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
7100mAh బ్యాటరీ
Nubia NaviX Ultraలో 7,100mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. 7.62mm మందం ఉన్న బాడీలో ఇంత పెద్ద బ్యాటరీని అమర్చడం ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటి. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫోన్‌లో వేడిని నియంత్రించేందుకు 7,100 చదరపు మిల్లీమీటర్ల 3D వేపర్ ఛాంబర్‌తో కూడిన “గాలక్సీ కూలింగ్ సిస్టం”ను ఉపయోగించారు. ఎక్కువసేపు గేమింగ్, వీడియో రికార్డింగ్ వంటి పనులు చేసినప్పుడు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఈ వ్యవస్థ సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.
OLED డిస్‌ప్లే..
ఈ కొత్త ఫోన్ లో 6.78 అంగుళాల LTPO 2.0 OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 100 శాతం DCI-P3 కలర్ గ్యామట్‌తో వస్తుంది. 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, DC డిమ్మింగ్, 2,160Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 3nm ప్రాసెస్‌పై తయారైన Snapdragon 8 Elite Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్, Adreno 840 GPU ఉన్నాయి. 12GB, 16GB LPDDR5X RAM ఆప్షన్లతో పాటు 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత Nebula AIOS 2పై ఫోన్ పనిచేస్తుంది.
ప్రత్యేక AI బటన్
ఈ ఫోన్‌లో AI ఫీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ రికగ్నిషన్‌తో కూడిన ప్రత్యేక AI హార్డ్‌వేర్ బటన్‌ను అందించారు. “సీడ్ ఫుల్-డ్యూప్లెక్స్ వాయిస్” మోడల్‌తో కలిసి ఇది పనిచేస్తుంది. వినియోగదారులు సంభాషణను మధ్యలో ఆపి కొత్త ప్రశ్న అడిగినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేకుండా సంభాషణను కొనసాగించేలా దీన్ని రూపొందించారు.
“Doubao మొబైల్ అసిస్టెంట్” ద్వారా యాప్‌ల మధ్య బహుళ దశల పనులను ఆటోమేటిక్‌గా పూర్తి చేసే సామర్థ్యాన్ని ఫోన్‌లో అందించారు. డీప్ రీజనింగ్, జనరలైజేషన్, సెల్ఫ్ కరెక్షన్, లాంగ్-కాంటెక్స్ట్ అడెరెన్స్ వంటి సామర్థ్యాలతో ఈ AI ఏజెంట్ పనిచేస్తుందని నుబియా తెలిపింది. ఒక్క వాక్యంతో ఇచ్చే క్రాస్-యాప్ ఆదేశాల్లో 80%కి పైగా టాస్క్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ రేట్ ఉందని కంపెనీ పేర్కొంది.
స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని గుర్తించి సమాధానం ఇవ్వడం, వస్తువులను గుర్తించి షాపింగ్ ఛానళ్లకు తీసుకెళ్లడం, కాల్స్‌కు ఆటోమేటిక్‌గా సమాధానం ఇవ్వడం, ముఖ్యమైన నోటిఫికేషన్లను ప్రాధాన్యతతో చూపించడం వంటి AI ఫీచర్లు ఉన్నాయి. రికార్డింగ్లను ట్రాన్స్‌క్రైబ్ చేసి సారాంశం తయారు చేయడంతో పాటు, అనుమతి ఇచ్చిన స్థానిక ఫైళ్లలో సహజ భాషతో సమాచారాన్ని వెతికే సదుపాయం కూడా అందించారు.

కనెక్టివిటీ ఫీచర్స్
కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్ 4G VoLTE, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బరువు 208 గ్రాములు కాగా, కొలతలు 162.11×75.69×7.62mm. డ్యూయల్ స్పీకర్లు, DTS:X Ultra, మూడు మైకులు, డ్యూయల్ X-axis లీనియర్ మోటార్లు కూడా ఉన్నాయి.
ధర
డ్రీమ్, బ్లూ, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ లభిస్తుంది. చైనాలో ఇప్పటికే విక్రయాలు ప్రారంభమయ్యాయి. కంపెనీ ప్రకారం, సేల్ ప్రారంభమైన ఒక్క సెకనులోనే 100 మిలియన్ యువాన్లకు పైగా అమ్మకాలు జరిగాయి. చైనాలో Nubia NaviX Ultra ప్రారంభ ధర 5,999 యువాన్లుగా ఉంది. డిస్కౌంట్ తర్వాత ధర 5,499 యువాన్ల నుంచి ప్రారంభమవుతుంది.
* 12GB + 512GB: 5,999 యువాన్లు.
* 16GB + 512GB: 6,499 యువాన్లు.
* 16GB + 1TB: 7,499 యువాన్లు.