Reading Time: 2 minutes
IND ODI Squad Announcement Live: రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా?

India vs West Indies ODI Squad Announcement Live Updates: వెస్టిండీస్‌తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును నేడు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీసీఐ ఉన్నతాధికారుల ఎంపిక సమావేశం జరుగుతోంది. ఓ నివేదిక ప్రకారం, ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందం ఈ నెల చివరలో ముగిసిపోనుంది. ఇదే అగార్కర్ కు చివరి ఎంపిక సమావేశం కావొచ్చు. వెస్టిండీస్ సిరీస్ కోసం జరిపే ఈ ఎంపిక సమావేశమే తనకు చివరిది కావొచ్చని అగార్కర్ తనకు సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు ఆ నివేదికలో పేర్కొంది. అగార్కర్ ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించుకుంటారని ముందుగా భావించినా, అయితే, రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల తలెత్తిన వివాదాలు, బీసీసీఐ ఉన్నతాధికారుల మధ్య సంబంధాలు చెడినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఇదే ఫైనల్ సెలక్షన్ కావొచ్చని చెబుతున్నారు.

  1. పేస్ బౌలింగ్ విభాగానికి సిరాజ్ సారథ్యం?: జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ బౌలింగ్ విభాగానికి మహమ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. అతను ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే జట్టులో భాగం కానప్పటికీ, గత సిరీస్‌లో ఆడిన గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు తిరిగి జట్టులోకి రానున్నాడు.
  2. రోహిత్ జట్టులో ఉంటాడా లేదా?: సెలక్షన్ గడువు సమీపిస్తున్న కొద్దీ రోహిత్ శర్మ భవిష్యత్తు కీలక చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లో జరిగిన భారత చివరి వన్డే సిరీస్ సందర్భంగా, జట్టు తరపున రోహిత్‌కు అదే చివరిది కావొచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, సెలెక్టర్ల ప్రణాళికలలో ఉన్నంత కాలం రోహిత్ ఆడుతూనే ఉంటాడని చెబుతూ, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఆ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే.
  3. రిషబ్ పంత్ రీఎంట్రీ..?: పీటీఐ నివేదిక ప్రకారం, వెస్టిండీస్ సిరీస్‌తో రిషబ్ పంత్ భారత వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో పంత్ పేలవ ప్రదర్శన కారణంగా టెస్ట్ వైస్ కెప్టెన్సీతో పాటు వైట్-బాల్ జట్లలో కూడా స్థానం కోల్పోయాడు. అయితే, ఇషాన్ కిషన్ జపాన్‌లో ఉండటంతో, కేఎల్ రాహుల్ వన్డే కీపర్‌గా ఎంపిక కావడంతో 15 మంది సభ్యుల జట్టులో పంత్ కు చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ లేని సమయంలో రాహుల్ శుభ్‌మన్ గిల్‌కు డిప్యూటీగా కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంత్‌కు అవకాశం దక్కకపోతే, సెలెక్టర్లు ధ్రువ్ జూరెల్‌ను ఎంచుకుని, ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించడానికి పంత్‌ను పంపుతారు,” అని ఆ నివేదిక పేర్కొంది.
  4. పాటీదార్ రీఎంట్రీ..?: పార్ల్‌లో దక్షిణాఫ్రికాతో తన ఏకైక వన్డే ఆడిన మూడేళ్ల తర్వాత, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బ్యాకప్ నెం. 4 స్థానం కోసం పోటీలో ఉండవచ్చు. ఆసియా క్రీడల్లో భారత్‌కు నాయకత్వం వహించనున్న శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో, ఈ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్ భర్తీ చేసే అవకాశం ఉంది.