Reading Time: 2 minutes

రోజంతా ఉండే పని ఒత్తిడి, రాత్రి వేళల్లో అనవసర ఆలోచనల (Overthinking) వల్ల చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు. కళ్ళు మూసుకున్నా మనసు ప్రశాంతంగా ఉండక అటూ ఇటూ దొర్లుతుంటారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. పడుకునే ముందు కొన్ని తేలికపాటి వ్యాయామాలు, శ్వాస పద్ధతులు పాటించడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతపడి గాఢమైన నిద్ర పడుతుంది. రాత్రి హాయిగా నిద్రపోవడానికి సహాయపడే ఆ మూడు సులభమైన పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మౌంటెన్ పోజ్ (పర్వతాసనం): పడుకునే ముందు ప్రశాంతంగా నిలబడి శరీర సమతుల్యతను కాపాడుకునే మౌంటెన్ పోజ్ చేయడం వల్ల రోజంతా శరీరంలో పేరుకుపోయిన అలసట తొలగిపోతుంది. ఇక ఇది వెన్నుముకను నిటారుగా ఉంచి, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. మనసును ప్రశాంతపరిచి రాత్రివేళ గాఢ నిద్రకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

Want Better Sleep? Try These Simple Exercises Before Bed
Want Better Sleep? Try These Simple Exercises Before Bed

ఓవర్‌హెడ్ స్ట్రెచింగ్ (చేతులను పైకి చాచడం): రెండు చేతులను తల పైకి చాచి నిటారుగా సాగదీయడం వల్ల భుజాలు, వీపు భాగంలోని కండరాల ఒత్తిడి తగ్గుతుంది. ఇక రోజంతా కూర్చుని పనిచేయడం వల్ల బిగుసుకుపోయిన కండరాలు సడలి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది పడుకునే ముందు శరీరానికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

బెల్లీ బ్రీథింగ్ (పొట్ట శ్వాస పద్ధతి): పడుకుని లేదా ప్రశాంతంగా కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట పైకి రావడం, వదిలేటప్పుడు లోపలికి పోవడం గమనించాలి. ఇక ఈ బెల్లీ బ్రీథింగ్ వల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అంది, ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోతాయి. అనవసర ఆలోచనలు తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

నిద్రలేమితో బాధపడేవారు రోజూ పడుకునే ముందు ఈ మూడు చిన్న చిట్కాలను తమ రాత్రివేళ అలవాట్లలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ప్రశాంతమైన మనసు, గాఢమైన నిద్ర మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.

గమనిక: ఈ సమాచారం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నివేదికల ఆధారంగా అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మీకు ఏవైనా తీవ్రమైన ఎముకలు లేదా వెన్నునొప్పి సమస్యలు ఉంటే నిపుణుల సలహాతోనే వీటిని ప్రయత్నించండి.

The post హాయిగా నిద్రపోవాలంటే పడుకునే ముందు ఈ వ్యాయామాలు మంచి నిద్రను ఇస్తాయి .. appeared first on Manalokam – Latest Telugu News & Updates.