Reading Time: < 1 minute

లవ్, కామెడీ విత్ ప్యూర్ ఎమోషన్స్.. ఆకట్టుకునేలా ‘ఫీల్ మై లవ్’ మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Caption of Image.

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న వినూత్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఫీల్ మై లవ్’ (Feel My Love). విజయవంతమైన చిత్రాల సమర్పకుడు ఏ.ఎన్. బాలాజీ నిర్మాణంలో దర్శకుడు హరి ప్రకాష్ ఎం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ’96’ ఫేమ్ ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

యువతను కట్టిపడేసే యూత్‌ఫుల్ ఎలిమెంట్స్, మెలోడియస్ లవ్ స్టోరీ, నవ్వులు పూయించే కామెడీతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ కొత్త పోస్టర్‌లో చిత్రంలోని ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామితో పాటు మధుసూదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక వంటి ప్రధాన పాత్రలన్నింటినీ ఎంతో కలర్‌ఫుల్‌గా చూపించి సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశారు. చెన్నై, పుదుచ్చేరి, మున్నార్, కొడైకెనాల్ వంటి ప్రకృతి అందాల నడుమ పిక్చరైజ్ చేసిన విజువల్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

►ALSO READ | Mandaadi Box Office: బాక్సాఫీస్ వద్ద ‘మండాడి’ సునామీ.. 5 రోజుల్లో రూ.65 కోట్లకు పైగా కలెక్షన్స్!

రాజా రవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం అందించిన సంగీతం, ఎం.ఎస్. సతీష్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, అజయ్ మనోజ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. త్వరలోనే అత్యంత గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా రేంజ్‌లో గ్రాండ్‌గా రాబోతున్న ఈ సినిమా అధికారిక విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.