వృషభ రాశి: రాశినాథుడైన శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారు జనవరి 2 వరకు నిశ్చింతగా, సుఖ సంతోషాలతో, విజయాలు, సాఫల్యాలతో జీవితం గడపడానికి అవకాశం కలిగింది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయం పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి, ఇతర ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు శుభ పరిణామాలతో సాగిపోతాయి.
మిథున రాశి: రాశ్యధిపతి బుధుడు ఈ నెల 26 వరకు కన్యా రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, ఆ తర్వాత కూడా మిత్ర క్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం వల్ల అక్టోబర్ చివరి వరకూ ఈ రాశివారి జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో ఊహించని సాను కూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధి, వృత్తి, ఉద్యోగాలు, కుటుంబపరంగా విజయాలు, సాఫల్యాలు సాధిస్తారు. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
కన్యా రాశి: రాశ్యధిపతి బుధుడు ఈ నెల 26 వరకు సొంత రాశిలోనే ఉచ్ఛస్థితిలో ఉండడం, ఆ తర్వాత కూడా ధన స్థానమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల మరో నెలన్నర పాటు ఈ రాశివారి మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆశయాలు, లక్ష్యాలు సిద్ధిస్తాయి. ఏ ప్రయత్నం చేప ట్టినా సఫలమవుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, అనారోగ్య సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి కావడం, విదేశీ ఉద్యోగం లభించడం వంటివి జరుగుతాయి.
తులా రాశి: రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల జనవరి 2 వరకు ఈ రాశివారి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశముంది.
ధనుస్సు రాశి: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల అక్టోబర్ 31 లోగా ఆర్థిక, వ్యక్తి గత సమస్యలు పూర్తిగా పరిష్కారమై ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా సమసిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొద్ది శ్రమ తోనే అయినప్పటికీ ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది.
మీన రాశి: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టి ఈ రాశిని వీక్షించడం వల్ల ఈ రాశివారి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో నూరు శాతం లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ప్రము ఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.





