Reading Time: < 1 minute

పూజలు చేయలేదు..గణేశుడిని నిమజ్జనం చేశారు.. రంగారెడ్డి జిల్లాలో ఇలా చేశారు..!

Caption of Image.
  • గణేశుడి ప్రతిష్ఠపై వివాదం.. 
  • పూజలు లేకుండానే నిమజ్జనం

షాద్‌‌నగర్‌‌, వెలుగు: నవరాత్రులు పూజలు అందుకోవాల్సిన గణనాథుడు ఇరువర్గాల గొడవతో ఎలాంటి పూజలు అందుకోకుండానే గంగమ్మ ఒడికి చేరాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌‌ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగూడ మండలం పీర్జాపూర్‌‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో గణేశ్​ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రోత్సవాలు నిర్వహించాలని కొందరు గ్రామస్తులు భావించారు. 

అయితే హనుమాన్‌‌ దేవాలయంలో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందున ఆలయం వెలుపల వేరే చోట మండపం ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్‌‌ ఎర్రగుమ్ము నర్సింలుతో పాటు మరికొందరు సూచించారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో చౌదరిగూడ పోలీసులు రంగప్రవేశం చేశారు. 

ఆంజనేయస్వామి దేవాలయంలో ఎవరూ గణేశ్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని, వేరే చోట మండపం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల నిర్ణయంతో ఓ వర్గం నిరాశకు గురైంది. అనంతరం వారు గణేశుడిని సోమవారం పండుగ రోజునే గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.